Breaking News

జన గణనను వేగవంతం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన గణనను వేగవంతం చేయాలని సిటీ సెన్సెస్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు అన్నారు. శుక్రవారం ఉదయం వన్ టౌన్ లో గల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జన గణన చేసే ఎన్యుమేరేటర్లు మరియు సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, జన గణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో కీలకమైన ప్రక్రియ అని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించాలని, ప్రజలకు జనగణన ప్రాముఖ్యతను వివరించి సహకారం పొందాలని సూచించారు. ఎన్యుమేరేటర్లు కేటాయించిన ప్రాంతాలలో వేగవంతంగా సర్వే పూర్తి చేయడంతో పాటు, సేకరించిన వివరాల్లో ఖచ్చితత్వం పాటించాలని సూచించారు. జనగణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి అవసరమైన గణాంకాల సేకరణలో జనగణన అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రక్రియ కావడంతో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు కె. ప్రభుదాస్, కె. షమ్మీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు చంద్రబోస్ రాంబాబు, మోహన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *