గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జలధార పనులను జూన్ 15 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకుండా త్వరితగతిన నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుని అర్జీని అసంపూర్తిగా క్లోజ్ చేసిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) మ్యాపింగ్ సక్రమంగా పారదర్శకంగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. రీ సర్వే గ్రౌన్దింగ్ లెవల్ లో ఈకేవైసీ ఖచ్చితంగా చేపట్టాలని ఆదేశించారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టాలని , ఇరిగేషన్ కాలువల్లో గుర్రపు డెక్కలు తొలగింపు , పీకల వాగు లో వ్యర్ధాల తొలగింపు జూన్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు. పనుల పూర్తి అయిన వాటికి సంబంధించి డాక్యుమెంటేషన్ చేసి చేసి సక్సెస్ స్టోరీస్ క్రింద ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం కోసం స్థల పరిశీలన చేయాలన్నారు. ఏపీ సేవా పోర్టల్ లో హౌస్ సైట్ రెగ్యులరైజ్ స్కీం త్వరగా పూర్తి చేయాలన్నారు. అక్షర అంధ్ర క్రింద పెండింగ్ లో వున్న రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేయాలని , తల్లికి వందనం పధకంలో స్టూడెంట్ డేటా వెరిఫికేషన్ జూన్ 5 నాటికి పూర్తి చేయాలన్నారు. ఆధార్ లేని పిల్లలను గుర్తించి ఆధార్ కార్డులు అందజేయాలన్నారు. మన మిత్ర హౌస్ హోల్డ్ సర్వే తక్కువగా వుందని , యంపీడీఓ లు , కమీషనర్లు గ్రామ / వార్డు స్పెషల్ ఆఫీసర్ , పంచాయితీ సెక్రటరీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి హౌస్ హోల్డ్ సర్వేను పూర్తి చేయాలన్నారు. మూడు సంవత్సరాలు వచ్చిన పిల్లలను గుర్తించి అంగన్ వాడీ కేంద్రాలలో చేర్పించాలని , ఐదు సంవత్సరాలు పూర్తి అయిన పిల్లలు తరగతి గదిలో వుండేలా ఐసీడీఎస్ అధికారులు , విద్యా శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కర్మ యోగి ఐ గాట్ పోర్టల్ లో ప్రతి ఉద్యోగి నెలలో మూడు కోర్సులు చేయాలన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం అమరావతి వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖాధికారులు , యంపీడీఓ లు, మున్సిపల్ అధికారులు , యోగా సంస్థలు, యోగా శిక్షకులు కార్యక్రమ నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి , ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, గ్రౌండ్ వాటర్ శాఖ ఉప సంచాలకులు వందనం, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. పద్మావతి, తహసీల్దారులు , యంపీడీఓ లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News