-తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరికి ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవు..
-కలెక్టరు జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 18 మరియు 19 తేదీల్లో భారీ వర్షాలు మరియు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకొని వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాహశీల్థార్లు కార్యాలయాల్లో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం మేరకు బోట్స్ సిద్దంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోఉన్న ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈమేరకు అవసరమైన ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించాలన్నారు. బలహీనంగా ఉన్న కల్వర్టర్లు వద్ద పాడైన రహదారులు పై ముందుగానే ఇసుక బస్తాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు కలెక్టరు ఆదేశించారు. గ్రామ, వార్డు కార్యదర్శులకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరికీ ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని కలెక్టరు జె. నివాస్ ఆ ప్రకటనలో తెలిపారు.