Breaking News

సకాలంలో చికిత్సతో మధుమేహానికి అడ్డుకట్ట


-శ్రద్ధ వహిస్తే షుగర్ వ్యాధిని అడ్డుకోవడం సాధ్యమే..
-అత్యాధునిక చికిత్సలతో సత్ఫలితాలు
-ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు
-యలమంచి డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్లో ముగిసిన డయాబెటిస్ డే వారోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సకాలంలో చికిత్స అందించడం ద్వారా మధుమేహవ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చని యలమంచి డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ సీఎండీ, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు. వరల్డ్ డయాబెటిస్ డేను పురస్కరించుకుని హాస్పిటల్లో నిర్వహించిన అవగాహన వారోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం మనదేశంలో ఏడు కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు. తమకు మధుమేహవ్యాధి ఉన్నట్లుగా గుర్తించలేని వారు దాదాపు అదే సంఖ్యలో ఉండొచ్చని పేర్కొన్నారు. షుగర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, వైద్యులను సంప్రదించడాన్ని వాయిదా వేయకుండా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే విషయాన్ని గుర్తెరిగి వ్యవహరిస్తే మధుమేహవ్యాధిపై విజయం సాధించవచ్చని వెల్లడించారు. అవసరమైన డయాబెటిక్ పేషేంట్లు క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవాలని, టైప్ 2 డయాబెటిస్ పేషేంట్లకు సాధ్యమైనంత వరకు ఇన్సులిన్ అవసరం ఉండదని పేర్కొన్నారు. షుగర్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటిచూపు కోల్పోవడం తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలని, ప్రారంభ దశలోనే చికిత్స అందించడం ద్వారా సత్ఫాలితాలను సాధించవచ్చని అన్నారు. మధుమేహవ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ, క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా షుగర్ వ్యాధిని అదుపు చేయడం సులువైందని, తద్వారా రోగి యొక్క జీవితకాలం వృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాలను అవలంభించడం ద్వారా షుగర్ వ్యాధి బారినపడకుండా జాగ్రత్త వహించాలని, పిండిపదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలని సూచించారు. యలమంచి డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ద్వారా గత 35 ఏళ్లుగా మధుమేహవ్యాధి చికిత్సలను అందిస్తూ, అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. డయాబెటిస్ డే వారోత్సవాల్లో భాగంగా వైద్య పరీక్షలపై 20 శాతం రాయితీ అందించామని డాక్టర్ యలమంచి సదాశివరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ యలమంచి హిమన, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *