Breaking News

RLJP పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చాగంటిపాటి జాన్ వెస్లీ నియామకం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ లోనీ  ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ కి తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియించన పార్టీ జాతీయ అధ్యక్షులు పసుపతికుమార్ పారస్ కి ధన్యవాదములు తెలుపుచున్నానన్నారు. తనను నమ్మి, ఇంత పెద్ద భాధ్యత ఇచ్చినందుకు తన పనితనం ఏమిటో తెలుపుటకు సదవకాశం వచ్చిందన్నారు. మరియు తన యొక్క సేవలు పార్టీకి అందించుటకు సాయ శక్తులా పని చేస్తానని వాగ్దానమును చేయుచున్నానన్నారు. మరియు తన యొక్క పని తీరుతో ఆర్.ఎల్.జె.పి.ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగు లేని పార్టీ గా నడిపిస్తానని ఘంటాపదంగా చెప్పుచున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ML పాల్. భారత్ కుమార్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *