అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకువచ్చారు. అనష్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Tags amaravathi
Check Also
మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …
Prajavartha Online Telugu News