కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవ్వగలరని, ప్రతి గృహిణి కూడా పిల్లల్ని తప్పనిసరిగా గ్రంధాలయాలను పంపించాలని మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు కి చెందిన మహిళా ప్రతినిధులు, తమ తమ రంగాల్లో విశిష్ట చాటుతున్న మహిళలను లైబ్రరీయన్ త్రినాధ్ సన్మానించారు. ఈ సందర్భంగా బావన రత్నకుమారి మాట్లాడుతూ, ప్రతి ఏటా గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి దినోత్సవాన్ని మహిళా దినోత్సవం గా జరుపు కుంటున్నామన్నారు. జాతీయ నాయకురాలుగా దేశానికి విశిష్ట మైన సేవలు అందించి bharata దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత సాధించారని పేర్కొన్నారు. మహిళలకే గర్వకారణం అయిన జాతీయ నాయకులను స్మరించు కోవటం మన బాధ్యత అన్నారు. దేశ సుస్థిరత జాతీయ సమైక్యత కోసం వేర్పాటు వాదాన్ని అణిచి వేసిన ధీరవనిత ఆమె అన్నారు. విద్య, విజ్ఞానం యొక్క ఆవశ్యకత ను గుర్తించాలని కోరారు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు త్యాగాలు మరవలేనివాని, సంచార గ్రంధాలయాల స్ఫూర్తి ఆనాడు మహిళలను స్వాతంత్రోద్యమం వైపు నడిపించిందన్నది మరువలేనిదన్నారు. ప్రతి తల్లి మహిళా దినోత్సవం స్పూర్తితో వారి పిల్లలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించాలని, ఉపాధ్యాయులు కూడా ఆదిశగా అడుగులు వెయ్యాల్సి ఉందన్నారు. నేడు పిల్లలు సెల్ ఫోన్, ల్యాప్ టాప్, టివి లకు అలవాటై పుస్తకాలు చదవడం ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గండ్రోతు అంజలి దేవి కౌన్సిలర్ సభ్యులు తోట లక్ష్మిప్రస న్న ,మదర్ థెరిస్సా హొమ్ వ్యవస్థాపకులు రీబ్కా రాణీ మున్సిపల్ స్కూల్ టీచర్ విజయ లక్ష్మి, కరాటే ఇన్స్ట్రక్టర్ మీసాల రాధా , లైబ్రేరియన్ జి. వి. వి. ఎ న్ త్రినాధ్, సోమరాజు తదితరులు పాల్గొన్నారు
