మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సినిమా అనేది మన సమాజంలో ఇప్పటికీ చాలా శక్తివంతమైన మాధ్యమం అని అది కేవలం వినోదంగానే ఉండకూడదని, ప్రేక్షకులకు ఉపయోగపడే మంచి సందేశం సైతం అందులో మిళితమై ఉంటే బాగుంటుందని తాను వ్యక్తిగతంగా కోరుకొంటానని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయం వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.
తొలుత హైదరాబాద్ నుంచి దర్జా సినిమా నిర్మాత పైడిపాటి శివశంకర్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పైడిపాటి రవి ,డైరక్టర్ సలీం మాలిక్ ( మాక్ ) బృందం మంత్రి పేర్ని నానిను కలిశారు. తమ చిత్ర యూనిట్ చిలకపూడి పాండురంగ స్వామి ఆలయం, బందరుకోట పోర్టు, మంగినపూడి బీచ్ ,గిలకలదిండి ఫిషింగ్ హార్బర్, కోనేరు సెంటర్ , గూడూరు, గుడివాడ సమీపంలోని వేల్పూరు సిద్ధాంతం లోని గుడి తదితర లొకేషన్లలో 20 రోజుల పాటు సునీల్, అనసూయ హీరో హీరోయిన్లగా నటిస్తున్న ‘ దర్జా ‘ సినిమా షూటింగ్ ఈ నెల 25 వ తేదీన మచిలీపట్నంలోప్రారంభించనున్నట్లు అందుకు తమ అనుమతి తొలి చిత్రీకరణ షాట్ కు క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ మంత్రిని కోరారు. సినిమా షూటింగ్ కు సంబంధించిన పోలీస్ అనుమతులు తదితర విషయాలు తన వ్యక్తిగత కార్యదర్శి రఘురామ్ పరిశీలిస్తారని, ఆయనను కలవాలని సూచంచారు. తనకు 25 వ తేదీ శాసనసభ ఉందని ఆ తర్వాత పలు కార్యక్రమాలు ఉన్నందున తన ప్రమేయం లేకుండా సినిమా షూటింగ్ ప్రారంభించుకోవాలని తానూ తప్పక ఈ 20 రోజులలో షూటింగ్ స్పాట్ కు వస్తానని వారికి తెలిపారు.
మచిలీపట్నానికి చెందిన దావళం మణి అనే మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తాను ఉయ్యూరు సాంఘీక సంక్షేక శాఖ వసతి గృఘంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నానని వృద్ధాప్యంకు తోడు ఆరోగ్యం సరిగా లేని తనను అక్కడ వార్డెన్ తనను వంట చేయమని అంటున్నారని తెలిపింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని సంబంధిత అధికారితో మాట్లాడి తాను ఆమె పరిస్థితి ప్రత్యక్షంగా చూసేనని ఆ తరహా విధులు నిర్వర్తించలేదని ఆమె ఆరోగ్య తీరును బట్టి ఆమె స్వస్థలం మచిలీపట్నంకు బదిలీ చేయాలనీ ఆదేశించారు
అబ్దుల అజీజ్ అనే ఉపాధ్యాయుడు మంత్రిని కలిసి బదిలీ గురించి అభ్యర్ధించారు. తెలంగాణా రాష్ట్రం జోన్ 5 ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నానని తాను ఆంధ్రా జోన్ 2 ప్రాంతానికి చెందిన వ్యక్తినని అయితే అంతర్ రాష్ట్ర బదిలీలో ఇక్కడి నుంచి తెలంగాణాకు వచ్చిన ఒక మహిళ 3 వ జోన్ కు చెందినవారని అందుచేత తనను జోన్ 2 కు బదిలీ చేయకుండా ఆమె పని చేసిన జోన్ 3 కు వెళ్ళమని అధికారులు వత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఈ విషయమై స్పందించిన మంత్రి తనకు అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని అప్పుడే తాను ఏ అధికారినైనా అడిగేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు.
ఉయ్యురు మండలం కాటూరు ప్రాంతానికి చెందిన ఒక మహిళ మంత్రికి తన సమస్య చెప్పింది. ఆర్టీసీలో పనిచేసే తన భర్త కొలుసు శివ నాగరాజు 10 సంవత్సరాల సర్వీస్ ఉండగానే మెడికల్ గా ఆన్ ఫిట్ తర్వాత గుండెపోటుతో మరణించారని సీసీఎస్ లోన్ ఉందని ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే, రిటైర్మెంట్ తాలూకా డబ్బులు సెటిల్ చేస్తామని అధికారులు అంటున్నారని ఆమె తెలిపింది. అలాగే తన కుమారుడికి కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
మచిలీపట్నం రాజుపేటకు చెందిన డి. భాను అనే యువతీ మంత్రి వద్ద తన సమస్య చెప్పింది. తాను బి ఎస్సి బి ఇడి , ఎం ఏ తెలుగు చదివేనని వలంధపాలెం లోని ఎం జె పి పాఠశాల అనుబంధ బి సి వెల్ఫేర్ బాలికల హాస్టల్ లో ఉపాధ్యాయినిగా కొంతకాలం పనిచేశానని గత ఏడాది కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయంలో తనను ఉద్యోగం తొలగించారని, స్కూళ్ళు మళ్ళీ ప్రారంభమైనప్పటికీ ఆ ఉద్యోగం ఇప్పటివరకు పిలవలేదని, చిన్న తరగతులకైనా టీచర్ గా తీసుకొంటామని అంటున్నారు గాని ఇప్పటికి ఉద్యోగంకు రమ్మని అనడం లేదని మంత్రి పేర్ని నానికి తెలిపింది.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …