విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత 26 సంవత్సరములుగా ప్రజల ఆదరాభిమానాలే పెట్టుబడిగా నాణ్యమైన స్వీట్స్ మరియు హాట్స్ తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్న వెంకటేశ్వర్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆటోనగర్ వారి శ్రీ సాయిబాబా ఘీ స్వీట్స్ & హోమ్ ఫుడ్స్ గురువారం నగరంలోని మొగల్రాజపురం లో నూతన బ్రాంచ్ ప్రారంభించారు. ప్రారంభ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మరింత చేరువ కావాలని నాణ్యమైన స్వీట్స్ మరియు హాట్స్ మరిన్ని రకాలు తయారుచేసి అందిస్తామన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతా మన్నారు. ప్రస్తుత కరోనా దృష్ట్యా తయారీ చేస్తున్న వర్కర్స్ కు వ్యాక్సినేషన్ పరిసరాల పరిశుభ్రత కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన స్వీట్స్ మరియు హాట్స్ తయారు చేసే క్రమంలో నాణ్యత పై రాజీ లేకుండా నాణ్యమైన సరుకులు వాడతామని కాజు పిస్తా బాదం స్వచ్ఛమైన నెయ్యి తో రకరకాల స్వీట్ తయారు చేస్తామని అందుకే తమని ప్రజలు ఇప్పటికీ ఆదరిస్తున్నారని తెలిపారు. ప్యూర్ ఘీ స్వీట్స్, బెంగాలీ స్వీట్స్, కాజు స్వీట్స్, హోమ్ ఫుడ్స్, పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, బేకరీ, పిజ్జా, బర్గర్ తదితర వెరైటీ ఐటమ్స్ తమదగ్గర అందుబాటులో ఉంటాయన్నారు. అన్నిరకాల స్వీట్స్ ఆర్డర్ల పై సప్లై చేస్తామన్నారు. తమకు నగరంలో ఆరు బ్రాంచులు ఉన్నాయని అతి తక్కువ ధరలతో నగరవాసులకు పసందైన అనేక రకాల స్వీట్స్ మరియు హాట్స్ లను అందజేస్తున్నామని తెలియజేశారు. నగరవాసులకు అందుబాటు ధరలతో మరిన్ని వివిధ రకాల సరిక్రొత్త రుచులుతో కస్టమర్ దేవుళ్ళకు స్వీట్స్ మరియు హాట్స్ అందించటానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి వారి సోదరులు, నగర ప్రముఖులు, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …