విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు కొండంత అండగా ఉంటూ పేద కుటుంబాలకు ఆపదలో ఆపద్బాంధవు గా నిలుస్తుందని వైస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం గుణదల వైసిపి కార్యాలయంలో అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకానికి 13వ డివిజన్ కు చెందిన పతి మురహరి రావు దరఖాస్తు చేసుకోగా మంజూరైన 32వేలు చెక్కును కలసి లబ్ధిదారులకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయతో కలిసి బుచ్చిబాబు అందజేశారు. అనారోగ్య సమస్యలతో అప్పులపాలైన కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అంటే ఏంటో కూడా ప్రజలకు తెలియదు అని నేడు జగన్మోన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అందరికీ ఆర్థిక సహాయం అందజేస్తున్నదాని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న అబివృద్దికి నోచుకోలేదు దేవినేని అవినాష్ నాయకత్వంలో వైస్సార్సీపీ ప్రభుత్వం లో 350 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టడం జరిగింది అని అన్నారు. ప్రభుత్వం అందజేసే పథకాలను ప్రజలు అందరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ అధ్యక్షలు రామాయణపు శ్రీనివాస్, వైసిపి నాయకులు ఉకోటి రమేష్,కోలా ఉమా,యర్రబోతు శ్రీను,యలమంద రెడ్డి, కార్పొరేటర్లు అంబడపుడి నిర్మలాకుమారి,కలపాల అంబెడ్కర్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు,కొరివి చైతన్య వర, చిన్నబాబు,సొంగా రాజ్ కమల్ మరియు బచ్చు మురళి పాల్గొన్నారు
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి చేసింది సున్యం
మంచినీటి కోసం ప్రజలు నానా కష్టాలు పడుతుంటే వాటికి శాస్విత పరిష్కారం చేస్తుంటే రోడ్లు పోతున్నాయి అని స్థానిక ఎమ్మెల్యే పనులు ఆపండి అనడం చాలా విడ్డురం అని కడియాల బుచ్చిబాబు ఎద్దేవా చేసారు. నియోజకవర్గంలో అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ పట్టించొకొని వారు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వద్ద ఫోటోలు దిగి వారి ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అన్ని కమ్యూనిటీ హాల్స్,యూజీడీ పనులు ఎప్పటికప్పుడు దేవినేని అవినాష్ కమిషనర్ మరియు అధికారులతో మాట్లాడి పెండింగులో ఉన్న పనులు త్వరగతిన పూర్తి చేస్తున్నారు. ఇకనైనా మీ షో రాజకీయాలు మానేసి మా ప్రభుత్వం లో జరిగే పనులు చూసి బుద్ది తెచ్చుకోవాలని హెచ్చరించారు.