Breaking News

దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్, కాకరపర్తి భవన్నారాయణ శ్రేష్ఠి హాల్ నందు ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ముఖ్య అతిథిగా హాజరై, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తో కలిసి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి. గురునాథం, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొర్రా కిరణ్, ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ అన్సారి, ఏపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి ఉమాశంకర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ బాజీ, నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కుసుమంచి గణేష్, అశోక్ షారోన్, దమ్ము రాజు, సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు నేలపాటి సుభాష్, బైరి రమణ, ఏపీసీసీ మైనారిటీ సెల్ మాజీ ఉపాధ్యక్షులు బేగ్, పశ్చిమ నియోజకవర్గ బ్లాక్-1 అధ్యక్షురాలు బి. సత్యవతి, గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖలీల్, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ చిలకా విజయ్, సిటీ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆర్. ప్రకాష్, పీసీసీ లీగల్ సెల్ కార్యదర్శి కండెల ప్రసాద్, రాష్ట్ర నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి, పీసీసీ బీసీ సెల్ చైర్మన్ సొంటి నాగరాజు, ఉపాధ్యక్షులు ఆర్. సతీష్, సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ యునెస్, 34వ డివిజన్ అధ్యక్షుడు ఎండి షరీఫ్, ఉమ్మడి కృష్ణా జిల్లా కాపు కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం రాజేష్, 59వ డివిజన్ అధ్యక్షుడు ఎం. శ్యాంప్రసాద్, 60వ డివిజన్ అధ్యక్షుడు డి. సాయికృష్ణ, సిటీ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు కే. సూరిబాబు, గుంటూరు కాంగ్రెస్ నాయకులు మోషే, రెహమాన్, 50వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ రియాజ్, 21వ డివిజన్ అధ్యక్షుడు రాజనాల గోపికృష్ణ, 7వ డివిజన్ అధ్యక్షుడు టి. శివకుమార్, 25వ డివిజన్ అధ్యక్షుడు ఎండి బషీర్, ఏఐసీసీ మాజీ సభ్యులు ఎస్. బషీర్ తో పాటు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  ప్రజాసేవ, సంక్షేమ పాలన, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన విశేష సేవలను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *