Breaking News

పిఠాపురంలో ఘనంగా జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కరణ

-ప్రత్యేక ఆకర్షణగా.. వేలాది బైకులతో ర్యాలీ
-జై జనసేన నినాదాలతో మారుమోగిన పిఠాపురం
-వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చిన ప్రత్యేక గీతం, ఏవీలు
-కోలాహలంగా పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమాలు
-జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కేక్ కటింగ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం పిఠాపురం వేదికగా పార్టీ యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కారమైంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకుల కోలాహలం నడుమ ‘జై కొట్టు’ విభాగం మొదలు కావడంతో నవ యువతలో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. ఇదే వేదిక నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈ వేడుకలను నిర్వహించారు.
పిఠాపురం నియోజకవర్గం అంతటా పండగ వాతావరణాన్ని తలపించింది. జన్మదిన వేడుకల్లో జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు, యువత వేల సంఖ్యలో పాల్గొనడంతో పిఠాపురం జనసంద్రమైంది. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో అభిమానులు ఈ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
• ప్రత్యేక ఆకర్షణగా బైక్ ర్యాలీ
‘జై కొట్టు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది యువత ఉత్సాహంగా బైక్ ర్యాలీలుగా బయలుదేరి చిత్రాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి అందరూ ఒక్కటై భారీ ర్యాలీగా పిఠాపురంలోని ‘జై కొట్టు’ ఆవిష్కరణ వేదిక వద్దకు చేరాలు. జనసేన జెండాలతో అలంకరించిన వేలాది ద్విచక్ర వాహనాలు, మారుమోగిన “జై జనసేన”, ‘జై పవన్ కళ్యాణ్’ నినాదాల మధ్య ర్యాలీ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. వేలాది బైకులతో యువత చేసిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని జన్మదిన వేడుకలకు మరింత సందడిని తీసుకొచ్చారు. జనసేన పార్టీపై యువతకు ఉన్న ఆదరణ, నమ్మకాన్ని ఈ భారీ బైక్ ర్యాలీ ప్రతిబింబించింది. పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పిఠాపురం చేరుకోవడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
• అలరించిన జై కొట్టు థీమ్ సాంగ్
యువజన విభాగానికి “జై కొట్టు” అనే ప్రత్యేక నామకరణం చేశారు. యువతలో ఉత్సాహం, పోరాట స్ఫూర్తి, ఐక్యతను ప్రతిబింబించేలా పిడికిలి బిగించి జై కొట్టే రూపకల్పనతో ప్రత్యేక లోగోను రూపొందించారు. చూడగానే యువతను ఆకర్షించే విధంగా రూపొందిన ఈ లోగో కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన గీతం యువతను విశేషంగా ఆకట్టుకుంది. “జై జై జై జై జై కొట్టు.. జన సైనికుడై కదం తొక్కి కట్టరా జట్టు” అంటూ ఉత్సాహభరితంగా సాగిన ఈ పాట యువతలో కొత్త ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని నింపింది. పాటలోని సందేశం, సంగీతం, దృశ్య రూపకల్పన సమన్వయంగా ఉండటంతో కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారింది. జై కొట్టు థీమ్ సాంగ్ కి యువత ఫ్లాష్ మాబ్ రూపంలో చేసిన డాన్స్ ఉత్సాహాన్ని రేకెత్తించింది. కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏవీలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువతను ఉత్తేజపరిచే సందేశాలతో రూపొందించిన దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక వైభవాన్ని తీసుకొచ్చాయి.
• కేక్ కట్ చేసిన నాదెండ్ల మనోహర్
పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, యువత సమక్షంలో నాదెండ్ల మనోహర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌  కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌ తలాటం సత్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, పిఠాపురం నియోజక వర్గం పార్టీ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *