విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
80-విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారి (ERO) మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర అధ్యక్షతన గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించారు.
ఈ సమావేశం లో Special Intensive Revision (SIR-2026)కు సంబంధించిన ప్రస్తుత పురోగతి, చేపడుతున్న చర్యలు, శిక్షణ కార్యక్రమాలు, తదుపరి కార్యాచరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల దాఖలు గడువును 10.09.2026 వరకు పొడిగించినట్లు తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి పరిష్కరించే ప్రక్రియ 05.10.2026 వరకు కొనసాగుతుందని, తుది ఓటరు జాబితాను 09.10.2026న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్‌ను అన్ని బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్నారు. నోటీసులు, హియరింగ్‌ల పురోగతిని సమీక్షించిన ERO, ఇప్పటివరకు 37,104 హియరింగ్‌లు పూర్తి చేసినట్లు తెలిపారు. హియరింగ్‌లకు హాజరుకాని కేసులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని ERO మరియు కమిషనర్ కోరారు.
ఈ సమావేశంలో AEROలు లక్ష్మి, కె. ప్రభుదాస్, రాంబాబు, కే. దుష్యంత్, ఎన్నికల విభాగం అధికారులు సురేష్ కుమార్, మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ అన్సారీ (INC), డి.కాశినాధ్ (CPI(M)), ఎన్. వెంకట్ (BJP), ఎన్ సాంబశివరావు (TDP), జి సుందర్ పాల్ (YSRCP) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News