Breaking News

మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో అక్షర ఆంధ్ర కు అద్భుత ఫలితాలు

-రెండేళ్లలో అక్షరాస్యత 72.6 శాతం నుంచి 82.1 శాతానికి పెరుగుదల
-25 లక్షల మందికి అక్షర జ్ఞానం అందించడం అభినందనీయం..మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి అక్షర జ్ఞానం అందించాలనే సంకల్పంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారి నాయకత్వంలో చేపట్టిన lఅక్షర ఆంధ్రకార్యక్రమం అద్భుత ఫలితాలను సాధిస్తోందని, ప్రతి ఇంటా అక్షరం, ప్రతి చేతిలో జ్ఞానం ప్రతి పౌరుడి జీవితంలో వెలుగు అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఒక రాష్ట్ర అభివృద్ధికి భవనాలు, మౌలిక వసతులు మాత్రమే కొలమానం కాదని, సామాన్య పౌరుడి చేతిలో ఉన్న అక్షరమే నిజమైన అభివృద్ధికి కొలమానమని అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్ర అక్షరాస్యత రేటు 72.6 శాతం నుంచి 82.1 శాతానికి పెరగడం, జాతీయ సగటు 80.9 శాతాన్ని అధిగమించడం రాష్ట్ర విద్యా రంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు.

అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి, కేవలం రెండేళ్లలోనే 25 లక్షల మందికి అక్షర జ్ఞానం అందించడం అభినందనీయమన్నారు. విద్యా రంగంలో ప్రచారానికి కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

పాఠశాల విద్యలో కూడా అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతానికి, విద్యార్థుల హాజరు 85.41 శాతానికి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి వరుసగా మూడు రోజులు పాఠశాలకు గైర్హాజరైతే ఉపాధ్యాయులు తల్లిదండ్రులను సంప్రదించి కౌన్సెలింగ్ ఇచ్చే విధానం విద్యార్థుల డ్రాప్‌అవుట్‌ను తగ్గించేందుకు దోహదపడుతుందని అన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ‘AI ద్వారా ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఆటిజం ఉన్న పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సమ్మిళిత విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

రాబోయే రోజుల్లో కూడా అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి తెలిపారు. 2027 మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబర్ 2027 నాటికి మరో 27 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ద్వారా మొత్తం 52 లక్షల మందికి అక్షర జ్ఞానం అందించాలనే లక్ష్యం ఎంతో గొప్పదని అన్నారు.

సెప్టెంబర్ 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 100 శాతం సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ సాగుతున్న ఈ అక్షర ఆంధ్ర అక్షర యజ్ఞం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *