‘బ్రతికితే దేశం కోసం… చస్తే దేశం కోసం…’ : ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌


-బాపూ బాటలో పయనిద్దాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాలనే ఆశయంతో ‘గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ ప్రయాణిస్తున్నారు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆదుకుంటూ వారిలో నిద్రాణమై వున్న జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను మేలుకొలుపుతున్నారు. అలనాటి స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేడు తాము ప్రారంభించిన ‘బాపూ…నీ బాట’లో కూడా మొదటి ఒక్కరితో ప్రారంభమై అది ప్రభంజనంగా మారుతుందని నమ్ముతున్నానని గాంధేయ వాది ఆర్‌.ఆర్‌.నాగరాజన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని జన్మించి వృత్తిరీత్యా తమిళనాడులో నివసిస్తున్న అణగారిన వర్గాలను ఆదుకునేందుకు గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ స్థాపించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వుంటూ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలో గాంధీ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పర్యటించి మారుమూల పల్లెల్లో వున్న ప్రజలకు జాతిపిత మహాత్మా గాంధీ బాపూజీ, భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలను తీసుకెళ్ళేందుకు కృషి చేస్తున్నానన్నారు. మహాత్మా గాంధీó, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ దేశానికి రెండు కళ్ళవంటి వారని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి వారు చేసిన కృషిని, త్యాగాలను ప్రజలకు ప్రచార రూపంలో తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో తాను నిండు వస్త్రధారణ నుంచి కొల్లాయిగా మారనని తెలిపారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేనే దేశ రూపురేఖలు మారతాయన్నారు. విద్యావిధానం అప్పుడు అందరికీ సమానమనే భావన ప్రజలలో రేకెత్తుతుందన్నారు. ‘ఇంట గెలిచి రచ్చగెలవాలనే నానుడి’ ప్రకారం తన కుటుంబంలో ఎవరిని నిర్భందించకుండా స్వేచ్చకు మారుపేరుగా పెంచుతున్నానని, దానికి నిదర్శనం గతంలో వరదల సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన చిన్న కూతురు జనని(7)కి సైకిలు కొనుక్కునేందుకు ఇచ్చిన డబ్బుతో తమను మరికొంత డబ్బును అడిగి వెయ్యిమందికి పడవలో వెళ్ళి పాలు, రొట్టెలు తమిళనాడులో పంచిపెట్టిందన్నారు. అలాగే తన కుమారుడు నలుగురు కుమారులలో ఒకరు ముస్లీం మత స్వీకరణలో తాను ఏమాత్రం అడ్డుచెప్పలేదన్నారు. మరో కుమారుడు తన అడుగు జాడలలో ఇప్పటి నుండే గాంధేయవాదాన్ని అవలంభిస్తున్న తనతో కొనసాగుతున్నారన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని భావించి తనకు చేతనైనంతలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలలో వివిధ పాఠశాలలో పిల్లల్లో సృజనాత్మకత, నైతిక విలువలు మరియు మానవతా భావాలు పెంచడానికి వివిధ రకాలైన కార్యక్రమాల నిర్వహించి వారిలో విజేతలకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామన్నారు. రాజకీయాలకు, వివాదాలకు అతీతంగా భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనతో ముందుకు వెళుతున్నామన్నారు. తన వంతుగా దివ్యాంగులు, బాధిత, వితంతు మహిళలకు, పేద మహిళలకు, పేద బాలికలకు తన చేతనైనంతలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తమ ఆశ్రమం ద్వారా వివిధ వృత్తులలో ఎందరో నైపుణ్యం వున్నవారికి తమ ఆశ్రమం ద్వారా చేతనైనంతలో వృత్తి అవకాశాలు కల్పించి ఆదుకుంటున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్దులకు తన వంతు సాయం అందిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఆర్‌ఎస్‌లాంటి ఉన్నత చదువులకు ట్రైనింగ్‌ సెంటర్లు, విద్యా బోధనా సంస్థ, వృద్ధాశ్రమం తదితర సేవా కార్యక్రమాలు చేసే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నేడు జరుగుతున్న బాలికలు, మహిళలపై జరుగుతున్న అరాచకాలు అరికట్టే విధంగా వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని, అలాగే తమ ఆశ్రమ సమీపంలోని చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని పేదవారిని తెలుసుకుని తమ ఆశ్రమం ద్వారా చేతనైనంతలో సాయం అందిస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా చివరి తన రక్తపు బిందువు వరకు గాంధేయవాదంలో నడుస్తూ ప్రజలలో వెళతామన్నారు. ‘బ్రతికితే దేశం కోసం… చస్తే దేశం కోసం…’ అనే నినాదంతో బావితరాల బాగుకై తపిస్తూ పిల్లల్లో దేశ స్వాతంత్ర భావాలు పెంచి సమాజంలో గల చెడుని దూరం చేయటానికి ప్రయత్నిస్తానన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *