విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గారు బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ,ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని ఆ దిశగా తాము ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సోమనాథం,టీ మైనర్ బాబు, గన్ని రాము, దోమకొండ. మేరీ, నారాయణ ప్రదీప్ రాజ్,సోము. గోవిందు, ఆకారపు. విజయకుమారి,ధార. రాము రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి. వాసు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి.అనిత, చేనేత విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్. సంజీవరావు, అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు , జనసేన ముఖ్య నాయకులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …