విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషిచేసిన మహనీయుడు, సంఘ సంస్కర్త డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ కు మరణాంతరం 1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను ప్రకటించిందని, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన మహనీయుడని డా. బి ఆర్ అంబేద్కర్ ను డీటీసీ ఎం పురేంద్ర కొనియాడారు. డా. బి ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడుతూ స్థానిక డీటీసీ కార్యాలయంలో సోమవారం రవాణాశాఖ ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి సురేంద్ర సింగ్ నాయక్, డా. బి ఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భం గా కార్యక్రమంను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంనకు డీటీసీ ఎం పురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డా. బి ఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళిలర్పించారు. అనంతరం డీటీసీ ఎం పురేంద్ర మాట్లాడుతూ ప్రజలను సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యం కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం వెనుకబడిన కులాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయపరమైన హక్కులు కల్పించేలా ఆశయాలు, లక్ష్యాలు కలిగి ఉండేలా భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వాలు ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగమేనని ఆయన అన్నారు. డా,, బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని డీటీసీ ఎం పురేంద్ర కోరారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించిన వారిలో డిటిసి యం పురేంద్ర, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి మణికుమార్, ఆర్టీఓలు ఆర్ జగదీశ్వరరాజు, ఎ విజయసారధి, టెక్నికల్ ఆఫీసర్ అసోసియేషన్ విజయరాజు, జోనల్ అధ్యక్షులు యం రాజుబాబు, కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షులు భద్రాచలం (రాజా), పూర్వపు సంఘం అధ్యక్షులు జె రాజారావు, కెవి సుబ్బారావు, యం వి ఇన్స్పెక్టర్లు ఆర్ ప్రవీణ్, నాగ మురళి, జె ఆశదేవి, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …