-అర్జీదారులకు సత్వర న్యాయాన్ని అందించడమే అధికారుల ప్రధాన లక్ష్యం…
-సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు సత్వర న్యాయాన్ని అందించాలని సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు.
స్థానిక సబ్ కలక్టరు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజలనుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల ప్రజలు వివిధ సమస్యలపై స్పందనలో ఇచ్చిన అర్జీలను శాఖాపరమైన అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు. తమ పరిదిలోని కాని అర్జీలను శాఖాపరమైన ఉన్నతాధికారులకు పంపించి పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం 61 అర్జీలు అందాయని సబ్ కలెక్టరు తెలిపారు. వీటిలో అత్యధికంగా ¬రెవనెన్యూ(సీసీఎల్ఏ) 26, వీయంసీ 8, పంచాయితీరాజ్ 6, పీఎల్సీఎఫ్ 4, హెల్త్ 3, ఇతర శాఖలకు సంబందించి మరో 14, అర్జీలు మొత్తం 61 అర్జీలు స్పందనలో వచ్చాయని సబ్ కలెక్టరు తెలిపారు.
అర్జీలు :-
ఎంతో కాలంగా నివశిస్తున్న సొంత స్థలంలో ఆర్థిక స్థోమత లేక ప్రహారీ గోడను నిర్మించుకోలేపోయామని, ఇటీవలి గోడను నిర్మంచుచుండగా సరిహద్దువారైన యర్రగుంట సుందరం కుమారులు గోడ నిర్మంచవద్దని బెదిస్తున్నారని కావున న్యాయం చేయాల్సిందిగా జి. కొండూరు మండలం వెలగలేరు గ్రామవాసి కొర్రపాటి మరియమ్మ వారి అర్జీలో పేర్కొన్నారు.
విజయవాడ వించిపేట వాస్తవ్యులు జి.లక్ష్మి తమ అర్జీలో నాకు ఇద్దురు కుమారులు, ఇద్దురు కుమార్తేలు వృద్దాప్యంలో ఉన్నందున నన్ను చిన్నకుమారుడు చూసుకుంటున్నాడు. పెద్దకుమారుడు కోడలు నాకున్న 25 సెట్లు ఇళ్లును ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కావున నేను బ్రతి ఉన్నంతకాలం నాపేరునే నాఇళ్ళు ఉండేవిదంగా న్యాయం చేయాలని కోరారు.
గంపలగూడెం మండలం మేడూరు గ్రామస్తుడు ఎస్.రవి తమ అర్జీలో ఇటీవల పాత రేషన్ స్థానంలో కొత్త రేషన్ కార్డు జారీ చేసే ప్రక్రియలో నాకు మోటారు బైక్ ఉందని రేషన్ కార్డు ఇవ్వలేదు. వాస్తవంగా నాకు మోటారు వాహనం లేదని, కావున కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు.
జగ్గయ్యపేట పట్టణంలో ఎస్.జీ.ఎస్. కళాశాలలో సుమారు 1200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని, ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేట్ కళాశాలలుగా మార్చడం వలన విద్యార్థులపై అధిక ఫీజులు భారం పెరింగిందని, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలని స్టూడెంట్ పెడరేషన్ ఆప్ ఇండియా జిల్లా అధ్యక్షులు యం. సోమేశ్వరరావు అర్జీలో పేర్కొన్నారు.
విజయవాడ సింగ్ నగర్ నివాసి ఎస్.సత్తిబాబు సబ్ కలెక్టరుకు వివరిస్తూ గత ఐదేళ్ళుగా గుండె ఇతర జబ్బులతో బాధపడుతూ ఇటీవలి ఆస్పత్రిలో జాయిన్ కాగా ఆరోగ్యశ్రీ ద్వార రూ.40 వేలు మంజూరుతో వైద్యం చేసించుకున్నానని, అయితే జీవితకాలం మందులు వాడాలని వైద్యులు చెప్పారని, అంత ఆర్థిక స్థోమత లేనందుకు సీయం రీలీఫ్ ఫండ్ మంజూరు చేయాల్సిందిగా ఆయన తన అర్జీలో కోరారు.