
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి అన్నదానం, హాస్పిటల్, ట్రాన్స్‌పోర్ట్ సేవలను గుర్తించి డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్శిటీ (టెక్సాస్) అనుబంధ యూనివర్శిటీ అయిన హోలీ స్పిరిట్ క్రిస్టియన్ (హెచ్‌ఎస్‌సి) యూనివర్శిటీ డాక్టరేట్‌తో సత్కరించినట్లు కంచికచర్ల మండలం ఆత్కూరు గ్రామవాసి యడ్లపల్లి రమణేంద్రబాబు తెలిపారు. శనివారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో యూనివర్శిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ ముత్తుకుమార్, ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్‌కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పత్రాన్ని అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రమణేంద్రబాబుకు ప్రముఖ సామాజిక వేత్తలు డాక్టర్ రమణ, డాక్టర్ పెనుమాక గోపాలకృష్ణ, ఎడ్లపల్లి బాలకృష్ణ శ్రీలక్ష్మీ అభినందనలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News