Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులను రాష్ట్ర సమాచార పౌరసంబందాల శాఖామాత్యులు పేర్ని వెంకటరామయ్య (నాని) స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ ఈ ఓ భ్రమరాంబ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితుల చే వెంకటరమణ దంపతులు లకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, తీర్ధ,ప్రసాదాలను అందజేశారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణా హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా హైకోర్ట్ రిజిస్ట్రార్లు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, కమీషనర్ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్

-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *