పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి వారిగా అండగా నిలుస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో వ్యవసాయ సొసైటీ వద్ద హార్వెస్టర్( వరి కోత యంత్రములు) ను రైతు తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ రంగనాధరాజు మాట్లాడుతూ, రైతులను, మహిళలను అన్ని విధములుగా అదుకుంటూ అండగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, మధ్యవర్తిత్వం లేకుండా వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యాధునిక సాంకేతిక యంత్రపరికరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. పెనుమంట్ర మండల పరిషత్ కార్యాలయం వద్ద జగనన్న సంపూర్ణ గృహ హక్కుపథకం రిజిస్టర్ పత్రాలు అందజేసే కార్యక్రమం OTS కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రిజిస్టర్ పత్రాలు అందజేశారు. ఓటిఎస్ ద్వారా పేద ప్రజలకు, అర్హులైన లబ్దిదారులకి స్వంత ఇంటి కల సాకారం చేస్తూ, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పత్రాల ను అందచేస్తున్నామన్నారు . ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు రూ.10 వేల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేయడం తోపాటూ, లక్షలాది రూపాయల రిజిస్ట్రేషన్, తదితర ఖర్చుల నుండి ఉపశమనం కలుగ చెయ్యడం జరుగుతున్న దని తెలిపారు. ఫాగింగ్ యంత్రాలు ప్రెజర్ పంపులు (శానిటరీ మిషనరీ) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సర్పంచులకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags penumantra
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …