-నియామకపు ఉత్తర్వులు అందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నందు విధులు నిర్వహిస్తూ ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి కుటుంబoలో ఈ నూతన సంవత్సర సంతోషంగా గడపాలనే ఉదేశ్యంతో నూతన సంవత్సర ప్రారంభ రోజున 14 మందికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించి నియామకపు ఉత్తర్వులను అందించుట జరిగిందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ వివిధ అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి స్థానములో 14 మందికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించి నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గార్ల చేతుల మీదుగా కారుణ్య నియామకపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భములో కమిషనర్ మాట్లాడుతూ మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, టర్న్ కాక్, శానిటరీ మేస్త్రి, డ్రైవర్, ఆఫీసర్ సభార్దినెట్, వాచ్ మాన్, పబ్లిక్ హెల్త్ వర్కర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని, మీరందరు విధి నిర్వహణలో బాధ్యతాయుతముగా విధులు నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ వాచ్ మాన్ లకు యునిఫారం పంపిణి చేసారు.
పై కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా. జె.అరుణ, మేనేజర్ డి.వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.