విజయవాడ/పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సంప్రదాయానికి ఎటువంటి భంగం కలగకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తిరుపతమ్మ ఉత్సవాలు నిర్వహించాలని సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయం రంగుల మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను మంగళవారం పెనుగంచిప్రోలులో అధికార్లతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ కేసులు, ఓమైక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాల నిర్వహణలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ క్రమంలో సంప్రదాయానికి ఎక్కడా భంగం కలగకుండా చూడాలన్నారు. ఉత్సవాలు ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి, 20వ తేదీ వరకు జరగనున్న దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈనెల 12, 13వ తేదీలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం, 20వ తేదీన రంగుల మహోత్సవం ప్రారంభం సందర్భంగా దేవతామూర్తులు పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట బయలుదేరుట, ఫిబ్రవరి, 12వ తేదీన దేవతామూర్తులు జగ్గయ్యపేట నుండి పెనుగంచిప్రోలు తిరుగుప్రయాణం, ఫిబ్రవరి, 16వ తేదీన అమ్మవారి కల్యాణ మహోత్సం జరుగుతాయన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల తప్పని సరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. క్యూ లైన్లలో సామజిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని, ఆలయ పరిసరాలలో శానిటైజేర్ భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆలయ పరిసరాలలో అపారిశుద్ధ్యానికి తావులేకుండా పూర్తి పారిశుద్ధ్యంతో ఉండే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ, ప్రజలు ఎక్కవగా ఎక్కడా గుమికూడి ఉండకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, క్యూ లైన్లు వేగంగా కదిలే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా కొవిడ్ కేసులు మరింత పెరిగిన పక్షంలో ఉత్సవాల సమయంలో కొవిడ్ నిబంధనలను మరింత ఎక్కువగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కే శోభారాణి, ఆలయ చైర్మన్ ఇంజం చెన్నకేశవ రావు , తహసీల్దార్ లు వి నాగభూషణం, వైకుంఠ రావు, నందిగామ డిఎస్పి జీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ పి చంద్రశేఖర్ రావు, అగ్నిమాపక శాఖ sfo టీ. మురళీకృష్ణ, ఎక్సైజ్ అధికారి avv శ్రీనివాస్, రవాణా శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …