స్పందన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు: సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ హెచ్చరిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటానని సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం డివిజన్ లోని తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ, ప్రణాళిక శాఖల అధికార్లతో గ్రామ, వార్డు సచివాలయాల్లోని దరఖాస్తుల పరిష్కారం, ధాన్యం సేకరణ, POLR, వెబ్‌ల్యాండ్ / SRO మ్యుటేషన్‌లు, నాలా మార్పిడి అంశాలపై సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రివర్యలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, స్పందన లో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగానే పరిష్కరించాల్సిందేనని, పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నందిగామ, విజయవాడ వెస్ట్, వీరులపాడు, తదితర మండలాలలో స్పందన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారానికి వీలుకాని దరఖాస్తులను అందుకు సంబందించిన కారణాలను దరఖాస్తుదారునికి తెలియజేస్తూ తిప్పిపంపాలన్నారు. ధాన్యం సేకరణకు సంబందించి రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు చేస్తారని, ఈ విషయంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించి,రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి ధాన్యం తేమ శాతంపై రైతులకు అవగాహన కలిగించాలని, ధాన్యం సేకరణకు సంబంధించి హమాలీ, రవాణా చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుందనే విషయాన్నీ రైతులకు తెలియజేయాలన్నారు. సేకరించిన ధాన్యానికి నిర్దేశించిన సమయంలోగా చెలింపులు జరిగేలా ఎఫ్ టి ఓ లు జనరేట్ చేయాలని, చెల్లింపులు పెండింగ్లో లేకుండా పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మ్యుటేషన్ , నాలా పన్నులు వసూలు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
సమావేశంలో డివిజన్ లోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల, పౌరసరఫరాల శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *