Breaking News

డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి: జేసీ శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కలిపించేందుకు డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఈ క్లినిక్ లలో ప్రాధమిక వైద్య సేవలతో పాటు, అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 8 మునిసిపాలిటీలు, 2 మునిసిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించి 63 డా. వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్ లు ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. వీటిలో 31 భవనాలు నూతనంగా నిర్మించాల్సి ఉండగా, వాటిలో 4 భవనాల నిర్మాణం పూర్తికావచ్చింది, మిగిలిన భవనాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలనీ మునిసిపల్ అధికార్లను జెసి ఆదేశించారు. మిగిలిన 32 భవనాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 26 భవనాలకు మరమ్మత్తులు, పెయింటింగ్ పనులు పూర్తయ్యాయని, , మిగిలిన 6 భవనాలకు సంబంధించి మరమ్మత్తులు, పెయింటింగ్ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో డా.వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్స్ సమన్వయాధికారి డా. మోతేబాబు , డిపిఓ మహేశ్వరరావు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *