అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఇందుకు సంబందించిన జి.ఓ.ఆర్టి నెం.205 ను డిశంబరు 22 ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంథం చంద్రుడు జారీచేశారు. గుంటూరుకు చెందిన షేక్ అబిదా బేగం, కర్నూలుకు చెందిన సయ్యద్ నూరుల్లా క్వాద్రీ, కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన షేక్ అబ్దుల్ షుకూర్, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ మట్లపూడి బాజీ వలీ మరియు విశాఖపట్నానికి చెందిన తయ్యా బౌనిస్సా ను రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వులను జారీచేసిన నాటి నుండి రెండేళ్ల పాటు రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా వీరు కొనసాగుతారు.
Tags amaravathi
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …