బాధితులకు ”ఊపిరి”. పోసేందుకు సిద్ధమైన ఆక్సిజన్ ప్లాంట్ల !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి వేవ్వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు వీలుగా బాధితులకు ఊపిరి . పోసేందుకు కృష్ణాజిల్లా వ్యాప్తంగా 9007 ఎల్ పి ఎం సామర్ధ్యం గల 15 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రజల కోసం సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు.
సోమవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్ ఆక్సిజన్ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే ఒమిక్రాన్ నిర్ధారణ కోసం విజయవాడ జినోమ్ స్వీకేన్స్ ల్యాబ్ ను సైతం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈరోజు మరో మంచి కార్యక్రమం దేవుని దయతో శ్రీకారం చుట్టామని అన్నారు. కోవిడ్ కారణంగా వైరస్ శ్వాసమీద, ఊపిరితిత్తులమీద ప్రభావం చూపిందిని దేశం మొత్తం మీద ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చాయో మనం చూశామని తెలిపారు. సెకండ్వేవ్లో నేర్చుకున్న పాఠాలనుంచి తీసుకున్న చర్యల కారణంగా ఈ రోజు ఈ మెరుగైన పరిస్థితిలోకి వచ్చేమన్నారు.

విపత్కర పరిస్థితును ఎదుర్కొనేందుకు కృష్ణాజిల్లా సిద్ధం —- జిల్లా కలెక్టర్ జె. నివాస్
కృష్ణాజిల్లావ్యాప్తంగా 9007 ఎల్ పి ఎం సామర్ధ్యం గల 15 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రజల కోసం అందుబాటు లోనికి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. జిల్లాలో డి ఎం ఈ ఆసుపత్రులలో 1000 ఎల్ పి ఎం సామర్ధ్యంతో 3 ప్లాంట్లు , 1000 ఎల్ పి ఎం సామర్ధ్యం గల ప్లాంట్లు మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, 500 ఎల్ పి ఎం సామర్ధ్యంతో అవనిగడ్డ, తిరువూరు ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ చెప్పారు.
జిల్లా ఆసుపత్రి మచిలీపట్నంలో 1000 ఎల్పీఎం ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో సి ఎస్ ఆర్ నిధుల కింద 2007 ఎల్ పి ఎం సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు మరో 7 ( విజయవాడలో 2, గుడివాడలో 1, మచిలీపట్నంలో 1 , నందిగామలో 1, జగ్గయ్యపేటలో 1 , కైకలూరులో 1 ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఇవి మొత్తం 9007 ఎల్ పి ఎం సామర్ధ్యం గల 15 ప్లాంట్లను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఎంతగానో ఉపకరిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీటిని సకాలంలో సిద్ధం చేయడానికి త్వరితగతిన నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలందరి తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జడ్పి ఛైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము, ముడ ఛైర్ పర్సన్ బొర్రా నాగ దుర్గ భవాని విఠల్ , విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ తోలేటి శ్రీకాంత, మచిలీపట్నం నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, బందెల కవిత థామస్ నోబుల్, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు, డి ఎం హెచ్ ఓ సుహాసిని, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరెండెంట్ జయకుమార్, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చలమలశెట్టి గాంధీ, నిమ్మగడ్డ సత్య ప్రకాష్, చీలి రవీంద్ర, ఉరిటి రాంబాబు, పలువురు వైద్యులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం

-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు  -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *