అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాలకు ఎటువంటి ఆపదలు కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ-2022ని డిజిపి గౌతమ్ సవాంగ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందికి ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ మరియు శాఖాపరమైన సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారాన్ని నూతన సంవత్సర డైరీ ద్వారా సిబ్బందికి అందజేయడం పట్ల రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులను అభినందించారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకొని ఈ నూతన సంవత్సరంలో కూడా సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు విలువైన, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా పోలీసు శాఖకు మంచిపేరు తీసుకురావాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.మస్తాన్‌ఖాన్, కోశాధికారి ఎం.సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …