విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సహకరిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి జగన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అవినాష్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు గురుంచి ఆయనకు వివరించినట్టు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,వై.సిద్ధార్థ్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …