విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రపధన నిలపడమే తన లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్,డొంక రోడ్డు ప్రాంతల్లో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక లతో కలిసి అవినాష్ పర్యటించి సచివాలయ సిబ్బంది, వలంటీర్ ల పనితీరు గురుంచి,సంక్షేమ పథకాల అమలుతీరును, సమస్యలను స్థానిక ప్రజల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది.పర్యటన లో సైడ్ డ్రైన్ నుండి మురుగునీరు లీక్ అవుతూన్న విషయం మరియు మంచినీటి సరఫరా లోపం గురుంచి స్థానిక ప్రజలు ఆయనకు తెలియజేయగా వెంటనే సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి డివిజిన్ ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి తో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వనిదే అని,అక్కచెల్లెమ్మ ల అభివృద్ధి కి జగన్ పాటుపడూతు అసలైన స్త్రీ పక్షపతిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గౌస్, భీమిశెట్టి నాని, రాజేష్, కాజా, కోటిరెడ్డి, వెంకటేశ్వరరావు, శివయ్య,ప్రసాద్, ఉప్పు మోహన్ రావు, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, కావాటి దామోదర్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …