-అజిత్ సింగ్ నగర్ శ్రీశ్రీశ్రీ నాగ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర్ణమిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ నాగ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజ, శాంతి హోమం, పూర్ణాహుతి జరిపారు. ఈ పూజ కార్యక్రమాలలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి స్వాగతం పలికి.. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఈ ప్రకృతి అంతా ఆ ఆదిపరాశక్తి స్వరూపమని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రభుత్వంపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నాయకులు అఫ్రోజ్, కొప్పుశెట్టి దుర్గారావు, మారుతి, ఆలయ ధర్మకర్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.