మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా మూడో దశ పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జాగ్రత్తలు పాటించి అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సూచించారు.
సోమవారం ఉదయం ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మూడవ దశ కొవిడ్ సంసిద్ధతపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఈ రెండు రోజుల్లో రోజుకు పది పాజిటివిటీ కేసులు మచిలీపట్నం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నమోదయ్యాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారు 23 మంది అడ్మిట్ కాబడితే, అందులో ఇద్దరు మాత్రమే అసలు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వున్నారనున్నారు. ఆ ఇరువురిలో ఒకరికి మాత్రమే ఆక్సిజన్ స్థాయి అత్యల్పంగా ఉందన్నారు. సంక్రాంతి మూడు రోజుల పండుగ నేపథ్యంలో షాపింగ్‌లు, సామూహికంగా జరిగిన ఇతర కార్యక్రమాలు కారణంగా కేసులు సంఖ్య మరింతగా పెరగడానికి అవకాశం ఉందని తెలిపారు. మూడవ దశ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ నివేదికలు పదే పదే చెబుతున్నాయిని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు. ఒకటి, రెండవ దశలలో జిల్లాలో సమర్థవంతంగా వైద్య సేవలు అందించడం జరిగిందని అన్నారు. మూడవ దశ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వాసుపత్రి పూర్తి సంసిద్ధతతో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని 450 పడకలకు ఆక్సిజన్ సరఫరా నెలకొల్పాలని , ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు సిద్దం చేసుకోవాలని వైద్య పరికరాలు, మందుల కొరత ఏమాత్రం ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఎలెక్ట్రోలైట్ బ్లడ్ అనలైజర్ తక్షణమే రప్పించుకోవాలని అందుకు ఖర్చు కాబడి 2 లక్షల రూపాయలు తానె ఇస్తానని మంత్రి చెప్పారు. అలాగే కోవిడ్ ప్రత్యేక సిబ్బంది నియామకం చేపట్టాలని , అనుభవం ఉన్న వైద్య సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇన్ పేషేంట్ పెరిగిన నేపథ్యంలో సిబ్బందిని పెంచుకోవాలన్నారు. కేసులు పెరుగుతుంటే బయపడరాదని లక్షణాలు బయల్పడిన వెంటనే పరీక్షలు ప్రభుత్వాసుపత్రిలో చేయించుకోవాలన్నారు. ప్రజలకు కొవిడ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే విధంగా సమాచార వ్యవస్థను సైతం ఏర్పాటుచేసుకోవాలన్నారు. గైనిక్ పరమైన సమస్యల కు నిరుపేదలైన తల్లి పిల్లల ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికు నిర్దాక్షిణ్యంగా రిఫరల్ కేసులు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి నుంచి తగ్గాలని, కరోనా విలయం కాలంలో పేదలకు భారీ ఊతంగా నిలిచిన ఆరోగ్య శ్రీ పథకం అమలులో అలసత్వం పనికిరాదన్నారు. పిల్లల వైద్యంలో ఎంతమంది చిన్నారులను ఆరోగ్యశ్రీలో గుర్తించి వైద్యం చేశారని ఆ వివరాలు తనకు తెలియచేయాలని మంత్రి ఆరోగ్యమిత్రను కోరారు.
ఓమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరించాలని మంత్రి పేర్ని నాని డాక్టర్ జగదీష్ ను కోరారు. స్పందించిన డాక్టర్ జవాబిస్తూ, =బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం . చికెన్ గున్యా కు దీనికి చాలా మాటకు ఒకటే లక్షణాలు ఉంటాయని చెప్పారు. మొదటి వేవ్ లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చని , వారి ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తినే ఉంటే తప్పించి వారిపై దీని ప్రభావము అత్యంత స్వల్పంగా ఉంటుందని డాక్టర్ జగదీష్ వివరించారు. ఇప్పటిదాకా కరోనా సోకకుండా , వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న వారికి సోక వచ్చని రెండు రోజులు అలసట , పొడి దగ్గు , 101 డిగ్రీలు దాటని జ్వరంతో ఇది పోతుందన్నారు. రెండో వేవ్ లో డెల్టా సోకిన వారికి ఇది సోకే అవకాశం బాగా తక్కువ . సోకినా వారికే అర్థం కాకుండా అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా పోతుందన్నారు. ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా అంతే కాకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్నవారికి ఇది సోకుతుందని ఆయన తెలిపారు. రోగుల ఇమ్మ్యూనిటి బాగుంటే త్వరగా కోలుకొంటారన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం ఆర్డీవో , జిల్లా కేంద్ర ప్రభుత్వా సుపత్రి కన్వీనర్ ఎన్ ఎస్ కె ఖాజావలి, డిఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ సుహాసిని ,డిసిహెచ్‌ఎస్ డాక్టర్ కె.జ్యోతిర్మణి, డాక్టర్ తేజశ్వని, ఆసుపత్రి సూపరింటెండెంటు, కన్వీనర్ డాక్టర్ఎం .జయకుమార్, ఆర్ ఎం మల్లిఖార్జునరావు, డాక్టర్ అల్లాడ శ్రీనివాస్, డాక్టర్ జగదీష్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చలమలశెట్టి గాంధీ, చీలి రవీంద్ర , నిమ్మగడ్డ సత్య ప్రకాష్ , ఉరిటి రాంబాబు, ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …