నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 24 వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ,అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు నూజివీడుకు రావద్దని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. అత్యవసర అర్జీల స్వీకరణకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేయడమైనదని, అర్జీదారులు తమ దరఖాస్తులను సదరు బాక్స్ లో వేసినట్లైతే సదరు దరఖాస్తును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారికి పంపడం జరుగుతుందన్నారు. దరఖాస్తు పరిష్కార విధానమును సదరు దరఖాస్తుదారునికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని, కావున అర్జీదారులు తమ దరఖాస్తులో తమ ఫోన్ నెంబర్ ను తప్పనిసరిగా నమోదు చేయాలని, కోవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్న దృష్ట్యా అత్యవసర సమస్యలకు సంబంధించిన వారు తమ దరఖాస్తులను కార్యాలయ ఆవరణలోని అర్జీల బాక్స్ లో తమ దరఖాస్తులను వేయాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి తెలియజేసారు.
Tags nuzividu
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …