Breaking News

టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో గృహా లబ్ధిదారులకు రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ శ్రీవాస్‌ నూపూర్‌ అజయ్‌కుమార్‌, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌ బి. చిన్నోడు, మున్సిపల్‌ కమీషనర్లు, బ్యాంకు కంట్రోలర్లు, గృహా నిర్మాణాల శాఖ, టిడ్కో, మెప్మా అధికారులతో రుణాల మంజూరు లక్ష్యాలపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు నిర్థేశించిన వారంతపు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్పిపల్‌ కమీషనర్లు, మెప్మా, టిడ్కో, గృహా నిర్మాణ శాఖ అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని మంజూరు లక్ష్యాలను త్వరిగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 19,376 టిడ్కో గృహాలకు 680 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సివుందన్నారు. అందులో ఇప్పటివరకు 2,830 గృహా లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రూ. 44 కోట్లు మంజూరు చేశారన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, మంజూరైన గృహాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వారాంతపు లక్ష్యాలను కలెక్టర్‌ సమీక్షిస్తూ విజయవాడ, మచిలీపట్నం, కార్పొరేషన్లు, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, ఊయ్యూరు, తిరువూరు, నందిగామ, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మున్సిపల్‌ కమీషనర్లను కలెక్టర్‌ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *