మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభ గల క్రీడాకారులకు ఈ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అభిలషించారు . బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తొలుత తూర్పు గోదావరి జిల్లా కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు మంత్రిని కలుసుకొని తన సమస్య తెలిపారు. 22 సంవత్సరాల క్రితం10 వ తరగతి విద్యార్హతతో స్పోర్ట్స్ కోటాలో ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ గా ఉద్యోగం పొందానని తాను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి బాడీ బిల్డర్, అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్నట్లు చెప్పారు. గత నవంబర్ 8 , 9 వ తారీఖులలో గుంటూరు జిల్లా నంబూరులో 45 ఏళ్ళ విభాగంలో జరిగిన అంతర్ రాష్ట్ర క్రీడాపోటీలలో అథ్లెటిక్స్ విభాగంలో హేమార్ త్రో ఈవెంట్ లో బంగారు పతాక విజేతనని, 36 పోటీలలో విజేతగా నిలిచి పలు పతకాలు మరెన్నో ప్రశంసాపత్రాలు పొందానని, జాతీయస్థాయిలో జరగనున్న వివిధ పోటీలలో పాల్గొనేందుకు జిమ్ లో , క్రీడా మైదానం లో ప్రాక్టీస్ చేస్తూ, తిరిగి ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నానని డ్యూటీల కారణంగా శారీరక అలసటకు లోనై ఏకాగ్రతతో బస్సును నడపలేక పోతున్నానని తెలిపారు. గతం నుంచి ఎన్నో కాంపిటేషన్ల లో పాల్గొని పలు బహుమతులు సంస్థకు తెచ్చానన్నారు. పోటీలకు పాల్గొంటూ మరోవైపు డ్రైవర్ గా 2000 సంవత్సరం నుండి విజయవాడ, బీమవరం, తాడేపల్లిగూడెం, రాజోలు, కాకినాడ డిపోలలో పనిచేస్తు న్నానని, ఆర్టీసీ సంస్థకు ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు తెచ్చానని ఇప్పటివరకు తనకు ఏ ప్రమోషన్ లేకుండా ఉన్నానని, స్పోర్ట్స్ కాంపిటేషన్లలో పాల్గొంటూ మరోవైపు విధి నిర్వహణలో ఒక్కసారి నిద్రమత్తు సైతం ఆవహిస్తుందని కనుక తనపై దయ ఉంచి తమ సంస్థలోనే ఓ డి విభాగం లోనికి దయతోమార్చాలని అప్పుడు మరింతగా శిక్షణ తీసుకోని మరిన్ని పతకాలు సంస్థకు రాష్ట్రానికి తీసుకువస్తానని మంత్రిని ఆయన అభ్యర్ధించారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, తప్పక మీ అభ్యర్ధన పరిశీలిస్థానని చెప్పారు. మీవంటి క్రీడాకారుల సేవలు సంస్థకు అవసరమని అన్నారు. క్రీడాకారుడికి సమాజంలో ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని విలక్షణమైన వ్యక్తిగా రాణించగలుతారని తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహయ సహకారాలు అందిస్తుందని గతంలో క్రీడల్లో కూడా రాజకీయాలు ఉండేవని కానీ ప్రస్తుతం ప్రతిభ గల వారికి మాత్రమే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఆటల్లో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించిందని అన్నారు. రాష్ట్రానికి చెందిన చాలా మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్నారని వారిని స్పూర్తిగా తీసుకుని ప్రస్తుతం వివిధ ఆటల్లో క్రీడాకారులు రాణించాలని తెలిపారు.
స్థానిక నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన సజ్జా మహాలక్ష్మి మంత్రిని కలిసి తన కష్టం చెప్పుకొంది. తనకు తమరు గతంలో ఎన్నో సహాయాలు చేసారని, ప్రస్తుతం ఆర్ధికంగా ఎంతో ఇబ్బందిగా ఉందని పింఛన్ వస్తున్నా ఇంటి అద్దెకు ఆ మొత్తం సరిపోతుందని ఆమె అన్నారు. తమరు కొద్దిగా పెట్టుబడి పెడితే, జడ పిన్నులు దువ్వెనల వ్యాపారం చేసుకొంటానని చెప్పారు.
Tags machilipatnam
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …