ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సత్యనారాయణపురంలో రూ.13.27 లక్షలతో డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురం ఆదిశేషయ్య వీధిలో సర్కిల్-2 కార్యాలయం నుండి వ్యాకరణం వారి వీధి గుండా ఎన్.ఆర్.పి.రోడ్డు వరకు రూ. 13.27 లక్షల విలువైన డ్రెయిన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అనంతరం అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యు.జి.డి.) సంపు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. మార్చి 15 కల్లా పనులు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. దీని ద్వారా డివిజన్లో డ్రెనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్పొరేటర్లు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. వాటన్నింటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విజయవాడ నగరంలోనే అత్యధికంగా 1,860 మంది విద్యార్థులు చదువుతున్న ఏకైక పాఠశాల A.K.T.P.M పాఠశాల అని మల్లాది విష్ణు అన్నారు. అటువంటి పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు.. రూ. 42 లక్షలతో 6 అదనపు గదులను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. పనులు పూర్తి చేసేందుకు మరో రూ. 6.5 లక్షలు అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలియజేశారు. దీనిని నగర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి.. పనులు పూర్తిచేసే దిశగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు దోనేపూడి శ్రీనివాస్, చామర్తి మూర్తి, సుబ్బారెడ్డి, కె.చంద్రశేఖర్, శ్రీనివాస్, కోలవెన్ను రమణ, నాడార్స్ శ్రీను, కొల్లూరు రామకృష్ణ, డీఈ గురునాథం, ఏఈ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *