Breaking News

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందాం… రిజర్వేషన్లను పరిరక్షించుకుందాం…

-బహుజనప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
బహుజనప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరు, అరండల్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1966లో తెలుగువారు పోరాడి సాధించుకున్న భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం, ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% వేయాలని కేంద్రం బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందని ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని బహుజనులు గా మేమందరం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలియచేశారు. ఆనాటి విశాఖ సాధన మహోద్యమంలో లక్షలాది మంది నాటి ఉద్యమంలో పాల్గొని 32 మంది ప్రాణత్యాగం చేశారని వేలాది మంది పై అక్రమ కేసులు బనాయించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 11 లక్షల టన్నులకు కేవలం 4890 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని పోరాడి సాధించుకున్న పరిశ్రమను పరిరక్షించుకునేందుకు జరుగుతున్న పోరాటంలో మేము సైతం అని ఫిబ్రవరి 12వ తారీకున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు, హిందూ కాలేజ్ సెంటర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరుగుతున్న “నిరసన దీక్ష “ను జయప్రదం చేయాలని బహుజనప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ తెలియజేశారు.
అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక ప్రభుత్వరంగ భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ విదేశీ ప్రైవేటు కంపెనీలకు అమ్మడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ ప్రయత్నాన్నీ నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఢిల్లీలోని లక్షలాది మంది రైతులతో సాగిన రైతాంగ ఉద్యమం యొక్క విజయం ఉద్యమకారులుగా మాకు ఎంతో స్ఫూర్తి అందించిందని, హక్కుల రక్షణ కోసం పోరు మార్గమే ఆచరణీయమని మరొకసారి నిరూపణ అయిందని, విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అంటే మన రాష్ట్ర అభివృద్ధి కాపాడుకోవడం, యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం, రిజర్వేషన్లను పరిరక్షించుకోవడం కోసం జరుగుతున్న పోరాటం గా చూడాలని ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరు కూడా అర్థం చేసుకొని ఈ పోరాటంలో పెద్దఎత్తున పాల్గొనాలని తెలియజేశారు.
ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని “మహోద్యమం” మొదలై సంవత్సర కాలంగా కావస్తున్న సందర్భంగా సామాన్య ప్రజానీకంలోకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో బహుజనప్రజా చైతన్య వేదిక నిర్వహిస్తున్న ఈ “నిరసన దీక్ష “లో రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తు కరపత్రాన్ని విడుదల చేశారు… ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు పాశం క్రిష్ణ, గుంటూరు నగర అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా, చల్లా రవికొండలరావు, గాలేటి శేఖర్, ఉమా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *