నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా మామిడి తోటల లో తామర పురుగు తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలని ఉత్యానవనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి మామిడి పంట రైతులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉష్ణోగ్రతల కారణంగా మామిడి పంటలో తామర పురుగు పెరిగిందని, వీటి నివారణకు రసాయనిక ఎరువులతో కాకుండా శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలన్నారు.
తెల్ల పూత దశ ఎక్కువగా ఉంటే – తామర పురుగు నివారణకు – స్పైనోసాడ్ లేదా స్పినోటేట్రమాట్ లేదా ఇమిడాక్లోప్రిడ్ వాడాలని, దారం పురుగు నివారణకు ఏమామెక్టిన్ బెంజోయెట్ వాడాలని సూచించారు. .
2. నల్ల పూత దశ లో పిందె కట్టు బాగా పడిన తోటలలో తియామెతోక్సమ్ /ఇమిడాక్లోప్రిడ్+వేప నూనె తో కలిపి పిచికారి చేసుకోవాలని, గానుగ సబ్బు ద్రావణం, వేప సబ్బు ద్రావణం కూడా పిచికారి చేసుకోవచ్చని సూచించారు.
3. కాయ పెరుగుదలకు నీరు పెట్టెప్పుడు నేల మీద క్లోరోపైరీఫాస్ కూడా పిచికారి చేయాలన్నారు. .
4. కలుపు మొక్కల మీద ఈ తామర పురుగుల రకాలు ఎక్కువగా తిరుగుతున్నాయి తోటలలో కలుపు లేకుండా చూసుకోవాలన్నారు. .
5. కెమికల్ స్ప్రే లు వరుసగా చేస్తూ పోవడం వలన తామర పురుగు ఉద్ధృతి పెరుగుతూ పోతుంది కనుక గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయానికి సంబందించిన క్షేత్ర సిబ్బంది సూచలను పాటించి, వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. జీవామృతం+వేపకషాయం ప్రతి 10రోజులకు స్ప్రే చేయించాలని, రెండు లేక మూడు స్ప్రే ల తరువాత ఇక కాయలు ముదురుతాయి కనుక ఇక తామర పురుగు సోకే అవకాశం ఉండదన్నారు. పురుగుల ఉధృతి కూడా అప్పటికి తగ్గుతుందని, పురుగుమందులతో అవసరం ఉండదన్నారు. మామిడి పంటలో రైతులు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సహకారం అవసరమైనా ఈ దిగువ తెలియజేసిన ఉద్యానవన శాఖ సిబ్బందిని ఆయా ప్రాంతాల రైతులు ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చన్నారు.
నూజివీడు 7995086890
తిరువూరు 7995086892
విస్సన్నపెట 7995086893
బాపులపాడు 7995086894
– AD హార్టికల్చర్ నూజివీడు- 7995086773 నంబర్లకు ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని జ్యోతి తెలియజేసారు.
Tags nuzividu
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …