విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా విజయవాడ ఆలపాటి రామారావు అండ్ అనుముల ఫంక్షన్ హాల్ నందు నేడు కాపు అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు బెల్లం నాగేశ్వరరావు సమక్షంలో కోపా ప్రెసిడెంట్ కొత్తపల్లి సంజీవ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. డోనార్ లో ఒకరైన పయ్యావుల రాము చేతుల మీదగా పేద విద్యార్థులకు విద్య కు చెక్కులను అందించడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సహాయాన్ని కోపా అసోసియేషన్ ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు 115 మంది పేద విద్యార్థులకు 7 లక్షల 50 వేల రూపాయలను అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెంకట రమణారావు, రామాయణం నాగ సత్యం, జనార్దన్ రావు, వల్లభరావు, రామ్మోహన్ రావు, మురళి మోహన్ రావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …