-ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సోమవారం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. బెంగుళూరు నుండి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 4.55 ని.లకు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పోలీస్ డిజి సంజయ్, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ జె. నివాస్ , ప్రోటోకాల్ అడిషనల్ డైరెక్టర్ ఎం.బి. వి.శర్మ, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి , ఎయిర్పోర్ట్ డైరెక్టయిర్ పి. వి.రామారావు, బీజేపీ నాయకులు, అధికారులు, ప్రభృతులు వున్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం నుండి రోడ్డు మార్గంలో ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ కు బయలుదేరి వెళ్లారు.