Breaking News

ఘనంగా ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు

-క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఉల్లాసాన్నిస్తాయి…
-ప్రతి మూడు నెలలకొకసారి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం ..
-తణుకు శాసనసభ్యులు డా .కారుమూరి నాగేశ్వర రావు

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తణుకు శాసనసభ్యులు డా.కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. తణుకు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడోత్సవాల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మేల్యే కారుమూరి నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యతనిచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇందులో ఓడినవారు నిరుత్సాహం చెందకుండా రాబోయే క్రీడలలో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్లాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరన్నారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు ఇక్కడికి రావడం జరిగిందని క్రీడాకారులలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇది ఒక మంచి అవకాశమన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలలో కూడా రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాప్ లీగ్ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా.. క్రీడాకారులలో దాగున్న ప్రతిభను వెలికితీయడం హర్షించదగ్గ విషయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడలలో ప్రతిభ కనపరిచిన వారికి ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు.

ఈ సంధర్బంగా ఆయా క్రీడల్లో గెలుపొందిన విజేతలకు పతకాల ను,ట్రోఫీ లను అందజేశారు.అనంతరం సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు సహకరించిన కోచ్ లను,స్థానికులను ఎమ్మేల్యే కారుమూరి నాగేశ్వర రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాప్ అధికారి సిర్రజుద్దిన్,జిల్లా క్రి డాపాధికర సంస్థ చీఫ్ కోచ్ అజీజ్,సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి ,పలువురు జెడ్పీటిసి లు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *