విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో డివిజన్లన్నీ సంపూర్ణ ఆరోగ్యకర ప్రాంతాలుగా విరజిల్లుతాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పేర్కొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేశారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దిడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. చెత్త తరలింపు కోసం ప్రతి డివిజన్ కు 2 నుంచి 3 వాహనాలు కేటాయించినట్లు వెల్లడించారు. నేరుగా ఇంటి దగ్గరే తడి, పొడి, హానికర చెత్తను వేరుచేసి సేకరిస్తున్నట్లు చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా తడి, పొడి చెత్త సేకరణతో సంపద తయారీపై ప్రజల్లో అవగాహన పెంచాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటేనే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. ప్రతి డివిజన్ ను చెత్తరహితంగా తీర్చిదిద్ది ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని.. నగర స్వచ్ఛతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల దుర్గారావు, బాబు, కిరణ్, నాని, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …