అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్ జవహర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేద పండితులు మంగళవారం కలిశారు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …