అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ మాసం నుంచి పెద్ద ఎత్తున అమలుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, హార్టికల్చర్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీధర్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హరినాధరెడ్డి, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసేందుకు తమ కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్ధాయిలో సహకరిస్తాయని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అనంతరం డ్రిప్ ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రిని ధన్యవాదాలు తెలిపారు.
Tags amaravathi
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …