నగరంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ మినీ టోర్నమెంట్…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కృష్ణలంక లోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల  నందు పీవీ సింధు బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియం లో మంగళవారం జరిగిన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా ఫౌండర్ బూడిద సైదులు, ఆర్గనైజేషన్ లో మరియు ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో డాక్టర్ వై ఎస్ ఆర్ మెమోరియల్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ మినీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు  ఆంధ్ర, తెలంగాణలో ఉన్న కరాటే మాస్టర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హీరో సుమన్ మాట్లాడుతూ ఈరోజు నా పేరు మీద ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవాడలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు విజయవాడలో సైదులు ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నానన్నారు.  ఈరోజుల్లో కరాటే ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా మహిళలకు మరియు బాలికలకు చాలా అవసరం ఉందన్నారు. మన చేతులే మనకు ఆయుధాలు. కరాటే నేర్చుకుంటే మహిళలు వాళ్లను వాళ్లు రక్షించుకోవచ్చు అని అన్నారు. విజయవాడ  కృష్ణ లంక 21 వ డివిజన్  స్థానిక కార్పొరేటర్  పుష్పాల కుమారి మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో మహిళలకు మరియు బాలికలకు కరాటే తో చాలా అవసరం ఉందన్నారు. కరాటే నేర్చుకుంటే బాలికలు, మహిళలు వాళ్లను వాళ్లు రక్షించుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రములో ఎం.ఎమ్ టి  టీమ్ సభ్యులు ఇరు రాష్ట్రాల కరాటే మాస్టర్స్ భారీ సంఖ్యలో విద్యార్థిలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *