విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. ఈ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలకు గాను బుధవారం మూడు మండలాల్లో తీవ్ర వడ గాలులు వీయగా, 43 మండల్లాల్లో వడగాలులు వీచాయి. తీవ్ర వడగాలులు వీచిన 3 మండలాలు విశాఖపట్నంలోనే ఉండడం గమనార్హం. ఇక రానున్న 24 గంటల్లో (17-03-2022) రాష్ట్రంలోని 8 మండల్లాల్లో తీవ్ర వడగాలులు, 93 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రానున్న 48 గంటల్లో (18-03-2022) రాష్ట్రంలోని 13 మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఈ జిల్లాలు ఇవే.. విజయనగరం (2), తూర్పుగోదావరి (01), కృష్ణా (03), గుంటూరు (02) మండలాల్లో తీవ్ర వడ గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Tags vijayawada
Check Also
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభానికి హాజరైన రాష్ట్ర …