విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం పరామర్శించారు. తొలుత ప్రజాశక్తి నగర్లో నివాసం ఉంటున్న సీనియర్ కార్యకర్త అక్కిశెట్టి నారాయణ నివాసానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలికి బలంగా గాయమై బాధపడుతున్న నారాయణకు ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అక్కిశెట్టి కుటుంబానికి వ్యక్తిగతంగా సాయం అందించడంతో పాటుగా.. అన్నివిధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. అనంతరం హృదయ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ప్రకాశ్ నగర్ కు చెందిన సీనియర్ నాయకురాలు వెంకటమ్మను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెంకటమ్మ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …