కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన లో వొచ్చే ప్రతి ఫిర్యాదు స్వీకరించి, తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదు లను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ ఈరోజు ప్రజల నుంచి మొత్తం పది ఫిర్యాదులు అందాయన్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులు ఫిర్యాదులు స్వీకరించడం లేదని , స్వీకరించినా రసీదులు ఇవ్వడం లేదని అభియోగాలు వొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదు స్వీకరించాల్సి ఉందన్నారు. స్థల, ఆస్తి వివాదాలు, పెరవలి మండలం డ్వాక్రా మహిళలు గ్రూప్ నుంచి ఇద్దరు తొలగింపు, ఆర్ధిక చేయూత, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలుపై ఆర్డీవో కి ఫిర్యాదు చేశారు. భూమికి సంబంధించిన సమస్యలు, వికలాంగ పెన్షన్, సదరన్ ధ్రువీకరణ, ఇంటి స్థలం కోసం, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రెండు ఫిర్యాదులు తదితర అంశాలపై స్పందనలో దరఖాస్తులు ప్రజలు అందచేయ్యడం జరిగిందన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ సిహెచ్. బాబూరావు, ఏవో జవహర్ బాజీ, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, డివిజన్ కి సంబంధించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …