-స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ ఆర్డీఓ రాజ్యలక్ష్మి సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్ ను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాదని, అటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పందన కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్., ఎక్సయిజ్ , పశుసంవర్ధక శాఖ, విద్యుత్, పరిశ్రమలు, కార్మిక శాఖ, ఇరిగేషన్ , డ్రైనేజీ , మత్స్య శాఖ వంటి ప్రధానమైన శాఖల అధికారులు గైరుహాజరు కావడంపై ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వీరికి షోకాజ్ నోటీసు లు జారీ చేయాలనీ, వీరిపై చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా కలెక్టర్ వారికి లేఖ రాయాలని పరిపాలనాధికారిని ఆర్డీఓ ఆదేశించారు. .
స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. . స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కారానికి అర్హత దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పరిష్కారాన్ని వీలుకాని దరఖాస్తులను అందుకు గలా కారణాలను ధరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలియజేయలన్నారు. .
నూజివీడు లోని ఎం.ఆర్ అప్పారావు కాలనీవాసులు తమ దరఖాస్తును సమర్పిస్తూ తమ కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించవలసినదిగా కోరారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళమని, సమస్య పరిష్కారాన్ని వెంటనే చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ ప్రజలకు హామీ ఇచ్చారు. నూజివీడు మనలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన పాములపాటి సురపురెడ్డి తాను శారీరక వికలాంగత్వంతో బాధపడుతున్నానని, తనకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయవలసిందిగా కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెదురుపావులూరు గ్రామానికి చెందిన రైతులు దరఖాస్తు సమర్పిస్తూ ముస్తాబాద్ గ్రామంలోని తమ భూములను జగనన్న ఇళ్ల పధకం నిమిత్తం భూ సేకరణ చేసారని, సదరు భూములకు సంబంధించి నస్టపరిహారాన్ని మంజూరు చేయలేదని, తమకు న్యాయం చేయాలనీ కోరగా వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.