Breaking News

స్పందన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి…

-95 అర్జీల రాక..
-సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఆర్జీదారులు సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన స్సందనలో వివిధ సమస్యల పరిష్కారానికి 95 ఆర్జీలు అందాయని సబ్‌కలెక్టర్‌ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ (సిసిఎల్‌ఏ) 53, పిఎల్‌సిఎఫ్‌ 7, పిఒయుసిడి 6, యంపిడివో 5, ఇతర అన్ని శాఖలకు సంబంధించి మరో 24, ఆర్జీలు కలిపి మొత్తం 95 ఆర్జీలు స్పందన ద్వారా అందాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు గడువులోగా పరిష్కారం చూపాలని, పరిష్కారం కాని వాటికి తగిన కారణాలను ఆర్జీదారులకు తెలపాలని సబ్‌ కలెక్టర్‌ అన్నారు.
వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన హరిబండి రామారావు ఆర్జీని సమర్పిస్తూ తనకు రావాల్సిన పెన్షన్‌, రేషన్‌ తిరిగి ఇప్పించాలని కోరారు.
విజయవాడ గవర్నర్‌ పేటకు చెందిన శ్రీపతి విద్యాసాగర్‌ ఆర్జీ ఇస్తూ తనకు రేషన్‌కార్డు మంజూరు చేయాలని కోరారు.
ఇబ్రహీంపట్నం చెందిన కె మౌనిక ఆర్జీ ఇస్తూ తనకు ప్రభుత్వ గృహాం మంజూరు చేయాలని కోరారు.
గత సోమవారం ఆర్జీ ఇచ్చిన విజయవాడకు చెందిన విభిన్న ప్రతిభావంతుడైన యం శ్రీనివాస్‌కు నేటి స్పందన కార్యక్రమంలో పెన్షన్‌ మంజూరు చేసి, వీల్‌చైర్‌ను సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ అందజేశారు. స్పందన కార్యక్రమంలో కార్యాలయ ఏఓ ఎస్‌. శ్రీనివాస్‌రెడ్డి, డిఎల్‌పివో చంద్రశేఖర్‌, వివిధ శాఖలకు చెందిన డివిజనల్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *